రామ్‌కు 10 లక్షల సైన్యం.. పెంపుడు కుక్కతో కలిసి సంతోషాన్ని పంచుకొన్న రాపో
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సోషల్ మీడియాలో మరో ఘనతను సాధించారు. ఇటీవలే ప్రారంభించిన తన యూట్యూబ్ ఛానెల్‌కు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ నమోదు కావడంపై రామ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులకే అనూహ్యమైన స్పందన చూపిస్తున్నందుకు ఆయన తన ఫాలోవర్స్‌కు థ్యాంక్స్ చెబుతూ తన పెంపుడు కుక్క బార్ట్ ఫోటోను షేర్ చేశారు.
తన యూట్యూబ్ ఛానెల్‌కు 1 మిలియన్ వ్యూస్ రావడంపై రామ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. బిగ్ థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు. దాంతో బార్ట్‌తో స్మిమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను అభిమానులకు అందించారు.

ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్న రామ్ తాజాగా RED అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఇక RED చిత్రం తమిళ చిత్రానికి రీమేక్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్; నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











