సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో రామ్ పోతినేని సినిమా: కథ వినగానే ఓకే చెప్పిన ఎనర్జిటిక్ స్టార్

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ సినిమా తర్వాత పంథాను మార్చుకున్న అతడు సెలెక్టివ్‌గా సినిమాలను చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతికి 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రామ్.. వెంటనే తమిళ పరిశ్రమకు చెందిన దర్శకుడు లింగుసామితో ప్రాజెక్టు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే మరో న్యూస్ బయటికొచ్చింది.

'పటాస్'తో దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి.. అప్పటి నుంచి గత ఏడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వరకు వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం 'F3' అనే సినిమా చేస్తున్న అతడు.. దీని తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ప్రాజెక్టును చేయబోతున్నాడట. కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరి మధ్య కథా పరమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే స్టోరీ లైన్ ఓకే అయిపోయిందని.. దీంతో వెంటనే రామ్ అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

Ram Pothineni Green Signal to Anil Ravipudi

అనిల్ రావిపూడి - రామ్ పోతినేని కలయికలో రాబోతున్న ఈ సినిమా 2022 ప్రారంభంలో మొదలు అవుతుందని అంటున్నారు. అప్పటి వరకూ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. లింగుసామి దర్శకత్వంలో రామ్ నటించే సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందనుంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రను పోషిస్తుందట. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X