RAPO19: షూటింగ్‌లో హీరో రామ్‌కు ప్రమాదం.. ఊహించని న్యూస్ చెప్పి షాకిచ్చిన యూనిట్

బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ కుర్రాడు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిగిరి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' అనే మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'రెడ్'తో మరో విజయాన్ని అందుకున్నాడు.

వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగు సామీతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ మధ్యనే రెగ్యూలర్ షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ ఫిల్మ్ చిత్రీకరణను పూర్తి చేయాలని యూనిట్ పట్టుదలతో ఉంది.

Ram Pothineni - Lingusamy Movie second schedule Wrapped

ఇందులో భాగంగానే ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా టాకీ పార్ట్‌ను ముందుగా కంప్లీట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా మొదటి షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. రెండో షెడ్యూల్ ఆరంభంలోనే హీరో రామ్‌ పోతినేనికి గాయం అయింది. దీంతో అతడు చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఆగిపోతుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఊహించని అప్‌డేట్ వచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రామ్ పోతినేనికి గాయం అవడంతో ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయినప్పటికీ సినిమా షూటింగ్ ఆపకుండా యూనిట్ తగిన ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగానే హీరో పాత్ర లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు లింగు సామీ. ఈ నేపథ్యంలోనే తాజాగా సెకెండ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌లో దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇందులో దర్శకుడు, ఆది పినిశెట్టితో పాటు పలువురు టెక్నీషియన్లు కనిపిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ భారీ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఇక, ఈ మూవీలో కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X