ఉస్తాద్ రామ్ రచ్చ మొదలయ్యేది అప్పుడే: ముందు అలా ప్లాన్ చేసిన స్టార్
చాలా రోజుల పాటు సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడ్డాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కెరీర్‌లోనే బెస్ట్ ఫిగర్స్‌ను అందుకున్నాడు. ఇక, ఈ మూవీ తర్వాత 'రెడ్'తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
రెండు హిట్లు తర్వాత రామ్ పోతినేని నటించబోయే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటికీ.. షూటింగ్ గురించి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ క్లారిటీ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ నటించే ఈ సినిమా షూటింగ్ జూలై రెండో వారం నుంచి ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు కూడా చేస్తుందని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో ఫస్ట్ షెడ్యూల ప్లాన్ చేశారని కూడా అంటున్నారు. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇందులో రామ్ పోతినేని రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవన్ విలన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. ఆ వార్తలను అతడు ఖండించాడు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











