RAPO19 అప్‌డేట్ వచ్చేస్తుంది: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఎనర్జిటిక్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్న అతడు.. కొంత కాలంగా ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' కెరీర్‌లోనే భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక, ఈ సంక్రాంతికి 'రెడ్' అనే మూవీతో వచ్చి.. మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్‌తో ఓ సినిమాకు సిద్ధం అయ్యాడు.

వరుస విజయాలతో దూసుకుపోతోన్న రామ్ పోతినేని.. తమిళ దర్శకుడు లింగుసామీతో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న దీనికి సంబంధించిన ఓ సర్‌ప్రైజ్ ఈరోజు రాబోతుంది. గురువారం సాయంత్రం 5.05 గంటలకు రామ్ నటిస్తోన్న 19వ చిత్రం గురించి ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో Ram Pothineni, RAPO19 అనే హ్యాష్ ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఫలితంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ వార్తల్లో నిలుస్తున్నాడు.

 Ram Pothineni Lingusamy Movie Update Today

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రను పోషిస్తుందట. వీళ్లతో పాటు 'గ్యాంగ్ లీడర్' ఫేం ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఓ స్పెషల్ రోల్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇది త్వరలోనే విశాఖపట్నంలో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X