హిట్టిచ్చిన దర్శకుడితో మరో మాస్ కథను సెట్ చేసుకుంటున్న ఇస్మార్ట్ రామ్!
టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఎప్పటి నుంచో బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూసిన రామ్ ఎప్పుడు లేని విధంగా తనలోని సరికొత్త మాస్ యాంగిల్ ని బయటకు తీసి క్రేజ్ కూడా పెంచుకున్నాడు. వీలైనంత వరకు నెవర్ బిఫోర్ అనేలా చాలా కొత్తగా ట్రై చేయాలని రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ సినిమా తడమ్ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. కందిరీగ సినిమా రామ్ కి ఎలాంటి విజయాన్ని అంధించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో రామ్ ఇప్పుడు మరొక కొత్త కథ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కందిరీగ సినిమా తరువాత సంతోష్ పెద్దగా సక్సెస్ అందుకున్నది లేదు. ఎన్టీఆర్ తో చేసిన రభస డిజాస్టర్ అవ్వగా ఆ తరువాత వచ్చిన హైపట్ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అనే సినిమాను తీస్తున్న సంతోష్ ఆ ప్రాజెక్టు అనంతరం రామ్ పోతినేనితో మరో మాస్ మసాలా సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











