Double Ismart Release Date: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతుందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో అంతకు మించిన యాక్టింగ్ తో అదిరిపోయే చిత్రాలు తీసిన ఈయన ఈ మధ్య కాస్త డల్ అయ్యారు. కానీ ఓ అద్భుతమైన సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తో వచ్చి హిట్ కొట్టిన కాంబో.. డబుల్ ఇస్మార్ట్ పేరుతో మరో సినిమా చేశారు. ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ మధ్య తీసిన చిత్రాలు ఫెయిల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తప్ప ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాపులుగానే నిలిచాయి. చాలా ఏళ్ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన ఈయన.. ఇక ట్రాక్ లో పడ్డాడు అనుకోగానే.. లైగర్ సినిమాతో ఎవరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్ ను చవిచూశాడు. ఈ క్రమంలోనే ఆయన మరో కథతో రామ్ పోతినేని వద్దకు వెళ్లడం.. రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పూరీతో తాను ఈ సినిమా చేస్తానని చెప్పడంతో.. డబుల్ ఇస్మార్ట్ కు బీజం పడింది.

Ram Pothineni Puri Jagannath Double Ismart Movie Release Date Fixed Check Details

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో.. మరో ఇస్మార్ట్ శంకర్ వస్తుందని తెలుసుకున్నప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో కూడా రామ్.. మరోసారి మాస్ పాత్రలో మెస్మరైజ్ చేయడం ఖాయం అని అనుకుంటున్నారు. అయితే అయితే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాను... పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్‌తో కలిసి పూరీ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రాంలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

జియాని గియాన్నెల్లి, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్లుగా పని చేస్తుండగా... మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని జూన్ 14వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. కచ్చితంగా సమ్మర్ లో తీసుకు వస్తేనే.. తమకు చాలా ప్లస్ అవుతుందని.. అనుకుంటున్నారట. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X