రామ్ పోతినేనికి హీరోయిన్ గట్టి పోటీ.. అప్పుడు జోడీ.. ఇప్పుడేమో ఢీ
దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ కంటే ముందుగా విడుదల తేది ప్రకటించారు. అయితే రామ్ పోతినేనిని ఓ క్రేజీ హీరోయిన్ ఢీ కొట్టబోతుంది. అదేంటనే విషయంలోకి వెళితే..
తొలి సినిమా దేవదాస్ తోనే మంచి క్రేజ్ తెచ్చకున్న హీరో రామ్ పోతినేని. తర్వాత జగడం మూవీతో కాస్తా నిరాశ పరిచిన.. రెడీ, మస్కా, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే వంటి లవ్ స్టోరీ చిత్రాలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా పూర్తిగా మాస్ హీరోగా మారిపోయాడు రామ్ పోతినేని. ఇప్పుడు మరోసారి ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమా RAPO20. ఈ సినిమా టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపిన మేకర్స్.. విడుదల తేదిని అనౌన్స్ చేశారు. బ్యూటిఫుల్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రామ్ తో రెండు సార్లు జోడీ కట్టిన బ్యూటిఫుల్ హీరోయిన్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఆమె సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం టిల్లు స్క్వైర్ (Tillu Square). సిద్దు జొన్నలగడ్డ బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15నే విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేనికి, అనుపమ పరమేశ్వరన్ మధ్య గట్టి బాక్సాఫీస్ పోటీ నెలకొననున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్-అనుపమ కలిసి హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్లో కలిసి నటించారు. అప్పుడు రామ్ కు జోడీగా ఉన్న అనుపమ ఇప్పుడు ఢీ కొట్టనుందని సోషల్ మీడియాలో సరదాగా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











