నువ్వే నువ్వే అంటూ రామ్ పోతినేని రొమాన్స్
ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం RED. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోష్‌ను చిత్ర యూనిట్ పెంచింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు.
నువ్వే నువ్వే.. నువ్వే,
నువ్వుంటే చాలుగా
మరే మనం కోరే..
పనేమీ లేదుగా
ఎడారి దారిలో
ఎదురయ్యే వానగా అంటూ సాగే పాటను హీరో హీరోయిన్లు రామ్ పోతినేని, మాళవిక శర్మపై చిత్రీకరించారు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మణిశర్మ సంగీతం అందించారు. రమ్య బెహారా, అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు.

గత నెల యూరప్‌లోని అద్భుతమైన లోకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొన్నది. ఇటలీలోని పర్వత తీరప్రాంతంలో అందాలకు నిలయమైన డొలమైట్స్ ప్రాంతంలో రెడ్ సినిమా పాటలను చిత్రీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో పలు హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: జునైద్,
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్,
దర్శకత్వం : కిశోర్ తిరుమల.


Click it and Unblock the Notifications











