Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
RED టీజర్.. రామ్ డబుల్ ధమాకా!!
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ మరో డిఫరెంట్ కథను ఎంచుకున్నాడు. తమిళ నాట సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్‌ను REDగా తెలుగు ప్రేక్షకులకు తన స్టైల్లో అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌కు ఎతంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
కెరీర్లో తొలిసారి క్రైమ్, థ్రిల్లర్ జోనర్ ట్రై చేస్తున్నాడు రామ్. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే.. రామ్ పాత్రల గురించి ఓ క్లూ వచ్చేస్తోంది. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ఇలాంటి క్రైమ్‌ను ఎన్నడూ చూడలేదనే వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఉంది. ఇక రామ్ మాస్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
పోలీసాఫీసర్ పాత్రలో నివేదా పేతురాజ్ ఆకట్టుకునేలానే ఉంది. మాళవిక శర్మ మరో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మధ్యే ఇటలీ వెళ్లి డోలమైట్ అనే ప్రాంతంలో ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఇక హైద్రాబాద్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.