50 కోట్ల దిశగా RED.. హీరో రామ్ జోరు మామూలుగా లేదు!!
ఇస్మార్ట్ హీరో రామ్ ప్రస్తుతం జోరుమీదున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ మీద దాడి చేసిన రామ్.. ఈ సారి REDతో రచ్చ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలోకి దిగిన రామ్.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా కూడా RED సినిమా మాత్రం అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొడుతోంది. మొదటి రోజే దాదాపు పన్నెండు కోట్ల గ్రాస్‌తో అందరినీ షాక్‌కు గురి చేసింది.
అలా మొదటి రోజు నుంచి కలెక్షన్లలో RED సత్తాను చాటుతూనే ఉంది. ఫస్ట్ డే 6.7 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో ఫస్డ్ డే కలెక్షన్లో ఇదే టాప్. అలా నాలుగు రోజుల్లోనే విడుదలైన ప్రతీ చోటా బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇప్పటికే పది హేను కోట్లకు పైగా షేర్‌ను సాధించేసింది. తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా REDకు 15 కోట్లు వచ్చాయి. హిందీ శాటిలైట్ హక్కుల ద్వారా మరో 12 కోట్లు వచ్చాయి. మొత్తానికి RED ఖాతాలో ఇప్పటి వరకు 43 కోట్లు పడ్డాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో యాభై కోట్ల క్లబ్‌లో RED నిలిచేలా కనిపిస్తోంది.

అయితే ఇదే కాకుండా RED సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. ఇక మలయాళంలో రేపు విడుదల కాబోతోందడగా.. ఫిబ్రవరిలో భారీ ఎత్తున ఈ సినిమాను హిందీలో డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేశారు. ఇలా మొత్తంగా అన్ని లెక్కలను కలిపితే RED సులభంగా యాభై కోట్లను క్రాస్ చేసేస్తుంది. మొత్తానికి రామ్ RED సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











