రామ్ డించక్ పాటకు మాస్ రెస్సాన్స్.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన RED చిత్రం విడుదలకు ముస్తాబుతున్నది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా విడుదలను వాయిదా వేశారు. అయితే రామ్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మాస్ మసాల సాంగ్ డించక్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారింది. మాస్ లుక్‌తో రామ్, హెబ్బా పటేల్‌తో వేసిన స్టెప్పులు అభిమానులు ఉర్రూతలూగించాయి.

ఇక జానీ మాస్టర్ సమకూర్చిన స్టెప్పులు మాస్ ఆడియెన్స్‌లో క్రేజ్‌ను పెంచేలా చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దర్శకత్వంలో రూపొందిన డించక్ పాటను రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, సాకేత్, కీర్తన శర్మ పాడారు.

Ram Pothinenis Dinchak Song trending in Youtube

యూట్యూబ్‌లో డించక్ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. విడుదల చేసిన తొలి గంటలో 1 మిలియన్ వ్యూస్, 5 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్, 10 గంటల్లో 3 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దాదాపు 18 గంటలపాటు య్యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు 190k లైక్స్, 6 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రామ్ ద్విపాత్రాభినయం చేశారు. తమిళ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్, మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ స్వంత బ్యానర్ స్రవంతి మూవీస్‌పై నిర్మించారు. లాక్‌డౌన్ అనంతరం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌,
ఫైట్స్: పీటర్‌ హెయిన్స్,
ఎడిటింగ్‌: జునైద్‌,
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌,
దర్శకత్వం : కిశోర్‌ తిరుమల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X