ఎనర్జిటిక్ స్టార్ రామ్ దిగేశాడు.. క్రేజీ టైటిల్, మైండ్ బ్లోయింగ్ ఫస్ట్‌లుక్

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సైలెంట్ అయిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయం రామ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అదే జోష్ కంటిన్యూ చేసేలా మరో విలక్షణ కథాంశానికి శ్రీకారం చుట్టాడు రామ్. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది.

రామ్ కెరీర్‌లో 18వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు RED (రెడ్) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు హీరో రామ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ అవతారం చూస్తుంటే ఈ సినిమాతో ఆయనకు స్టార్ స్టేటస్ ఖాయమే అనే భావన కలుగుతోంది. మాస్ లుక్‌లో అదరగొట్టేశాడు రామ్. పైగా చిత్రానికి RED అనే వినూత్న టైటిల్ కన్ఫర్మ్ చేయడం రామ్ అభిమానుల్లో మరింత ఎనర్జీ నింపింది. విడుదలైన కాసేపట్లోనే ఈ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.

Ram Pothinenis RED First Look Released

ఈ సినిమాను తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్‌ పతాకంపై తెరకెక్కించనున్నారు రామ్. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్‌ జోడిగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మలను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తమిళంలో సూపర్‌ హిట్ సాధించిన తడం సినిమాకు రీమేక్‌‌గా ఈ సినిమా రాబోతోంది. మాస్టర్ వర్షన్ అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తూ ద్విపాత్రాభినయం పోషించాడు. ఈ రీమేక్‌లో రామ్ హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రంతో రామ్ తన కెరీర్‌లో మొదటిసారి డబుల్ యాక్షన్ చేయబోతున్నాడు. నేను శైలజ రూపంలో రామ్‌కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలనే ఈ సినిమాకు దర్శకుడు కావడంతో రామ్ అభిమానుల్లో జోష్ రెట్టింపయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X