twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్

    |

    'ఇస్మార్ట్ శంకర్' వంటి భారీ విజయం తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్‌లు నటించారు. అలాగే, రామ్ తన సుదీర్ఘమైన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ మరోసారి విడుదలకు సిద్ధం అయింది. అయితే, ఈ సారి తెలుగులో కాదు.. మలయాళంలో.

    రామ్ నటించిన 'రెడ్' సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలుగు వెర్షన్‌ను జనవరి 14న ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మలయాళం వెర్షన్‌ను జనవరి 22న రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు, థియేటర్ల ఎంపిక తదితర పనులు పూర్తయ్యాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఎక్కువ థియేటర్లలోనే విడుదల కానుందట.

    Ram Pothinenis RED Malayalam Release Date Fix

    క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రెడ్'కు మొదటి నుంచీ మిశ్రమస్పందన వచ్చింది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. కెరీర్‌లో మొదటిసారి అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. 'రెడ్' మూవీ చూసిన వారంతా హీరో యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. వన్ మ్యాన్ షోలా మార్చేశాడని అంటున్నారు. ఈ కారణంగానే సినిమా వసూళ్ల పరంగా అదరగొడుతోంది. దీంతో నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించి సంక్రాంతి క్లీన్ హిట్‌గా నిలిచింది.

    English summary
    Red is an upcoming Indian Telugu-language action thriller film directed by Kishore Tirumala and produced by Krishna Chaitanya and Sravanthi Ravi Kishore under Sri Sravanthi Movies. It stars Ram Pothineni in a double role alongside Nivetha Pethuraj, Malvika Sharma and Amritha Aiyer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X