Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
'ఇస్మార్ట్ శంకర్' వంటి భారీ విజయం తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సొంత బ్యానర్లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్లు నటించారు. అలాగే, రామ్ తన సుదీర్ఘమైన కెరీర్లో తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ మరోసారి విడుదలకు సిద్ధం అయింది. అయితే, ఈ సారి తెలుగులో కాదు.. మలయాళంలో.
రామ్ నటించిన 'రెడ్' సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలుగు వెర్షన్‌ను జనవరి 14న ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మలయాళం వెర్షన్‌ను జనవరి 22న రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు, థియేటర్ల ఎంపిక తదితర పనులు పూర్తయ్యాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఎక్కువ థియేటర్లలోనే విడుదల కానుందట.
క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రెడ్'కు మొదటి నుంచీ మిశ్రమస్పందన వచ్చింది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. కెరీర్లో మొదటిసారి అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. 'రెడ్' మూవీ చూసిన వారంతా హీరో యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. వన్ మ్యాన్ షోలా మార్చేశాడని అంటున్నారు. ఈ కారణంగానే సినిమా వసూళ్ల పరంగా అదరగొడుతోంది. దీంతో నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించి సంక్రాంతి క్లీన్ హిట్‌గా నిలిచింది.