మోత మోగిస్తున్న రామ్ డించక్.. కొద్ది గంటల్లోనే 3 మిలియన్లు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని జన్మదిన సందర్భంగా రిలీజ్ చేసిన RED చిత్రంలోని డించక్ పాట యూట్యూబ్‌ను ఊపేస్తున్నది. మాస్ ఎలిమింట్స్‌తో తెరకెక్కించిన ఈ పాట ప్రేక్షకులను, అభిమానులను, నెటిజన్లను ఉర్రూతలూగిస్తున్నది. ఈ పాట రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే 3 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది.

మణిశర్మ అందించిన మాస్ బీట్‌కు హీరో రామ్ మాస్ లుక్‌ తోడుకావడంతో పాటకు మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఇక హెబ్బ పటేల్ గ్లామర్ కూడా తోడు కావడంతో నెటిజన్లకు పిచ్చెక్కింది. ఈ పాట యూట్యూబ్‌లో చాలా వేగంగా వ్యూస్ సాధిస్తున్నది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం రాయగా, సాకేత్, కీర్తన శర్మ పాడారు. ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ స్టెప్పులు సమకూర్చారు.

 Ram Pothinenis RED Mass song Dinchak goes viral

తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన RED సినిమాను ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ రూపొందించారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. స్పెషల్ సాంగ్‌లో హెబ్బా పటేల్ కనిపించారు. ఇక ఈ చితాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తారనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్రం రిలీజ్ కానున్నది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనావైరస్ కారణంగా థియేటర్లను మూవీ వేయడంతో రిలీజ్ వాయిదా పడింది.

 Ram Pothinenis RED Mass song Dinchak goes viral

సాంకేతిక నిపుణులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌,
ఫైట్స్: పీటర్‌ హెయిన్స్,
ఎడిటింగ్‌: జునైద్‌,
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌,
దర్శకత్వం : కిశోర్‌ తిరుమల.

 Ram Pothinenis RED Mass song Dinchak goes viral

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X