‘రెడ్’ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన నెట్‌ప్లిక్స్: అప్పటి నుంచే సందడి చేయనున్న రామ్
బడా నిర్మాత కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంటరైనప్పటికీ.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. కొంత కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ ఉత్సాహంతోనే కిశోర్ తిరుమలతో కలిసి 'రెడ్' అనే సినిమాను చేశాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాల తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన చిత్రమే 'రెడ్'. ఇక, ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ప్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాదు, అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో 'రెడ్'ను కూడా ఉంచింది నెట్‌ఫ్లిక్స్. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా దాదాపు ఏడు భాషల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్ని సినిమాలతో పోలిస్తే కొంత ఆలస్యంగా దీన్ని స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది.

రామ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్‌లు నటించారు. అలాగే, రామ్ తన సుదీర్ఘమైన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండానే 'రెడ్' మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. తద్వారా దాదాపు రూ. 20 కోట్ల వరకూ అందుకుని సత్తా చాటింది. దీంతో నిర్మాతకు బాగానే లాభాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











