క్యా బాత్ హై రామ్.. ఇస్మార్ట్‌గా RED రిలీజ్ డేట్‌ ఫిక్సా? పక్కా ప్లాన్‌తో..

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ విజయంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన కొత్త చిత్రం RED బుధవారం పూజా కార్యక్రమాలు జరుపుకొన్నది. పూజా కార్యక్రమాల అనంతరం నవంబర్ 16వ తేదీ నుంచి షూటింగ్ మొదలుపెడుతున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిసింది. తమిళ చిత్రం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి ఇటీవల రెడ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా RED సినిమా రిలీజ్‌ను కూడా స్రవంతి మూవీస్ బ్యానర్ ప్రకటించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రాన్ని 9వ తేదీ ఏప్రిల్, 2020 రోజున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం కనిపించింది. దీంతో దర్శకుడు కిషోర్ తిరుమల పక్కా ప్లానింగ్‌తో పోతున్నట్టు స్పష్టమైంది.

Ram Pothinenis RED movie to be release on April 9th

అంతకు ముందు జరిగిన పూజా, ముహుర్తం కార్యక్రమానికి పూరీ జగన్నాథ్, చార్మీ హాజరై క్లాప్ కొట్టగా.. జెమినీ కిరణ్ స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఈ వేడుక కోలాహలంగా మారింది.

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ.. సినిమా ముహుర్తం రోజున కాబట్టి ఎక్కువగా మాట్లాడలేను. కాకపోతే తొలిసారి ఓ థ్రిల్లర్ సినిమాలో, విభిన్నమైన కథతో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో పుష్కలంగా వాణిజ్య విలువలు ఉంటాయని, ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా సినిమా ఉంటుంది అని తెలిపారు.

స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ బాక్స్ బద్దలు చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రానికి పీటర్ హెయిన్స్ స్టంట్స్ కోరియోగ్రఫి చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X