నాన్ స్టాప్‌గా ఇస్మార్ట్ వీరుడి హంగామా.. తిరిగి ట్రాక్ ఎక్కేసిన రామ్.. మొత్తానికి మొదలెట్టాడు
చాలాకాలంగా సరైన హిట్ పడక సైలెంట్ అయిన హీరో రామ్.. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ మాస్ పర్‌ఫార్‌మెన్స్ యువతకు పూనకం తెప్పించింది. దీంతో అదే స్టైల్‌లో 'రెడ్' అనే మరో డిఫెరెంట్ సినిమాకు కమిట్ అయ్యాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. తమిళంలో హిట్ కొట్టిన 'తాడమ్' చిత్రానికి ఇది రీమేక్.
ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా.. తాజాగా రెగ్యులర్ షూట్ మొదలుపెట్టుకుంది. ఇది లాంగ్ షెడ్యూల్ అని, ఇక నాన్ స్టాప్‌గా షూటింగ్ సాగుతుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఈ షెడ్యూల్ లో రామ్‌పై మేజర్ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. ఈ చిత్రంలో రామ్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

'రెడ్' సినిమాను తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిస్తున్నాడు రామ్. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ జోడిగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మలను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వెండితెరపై రామ్ చెడుగుడు మరోసారి చూడాలని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.


Click it and Unblock the Notifications











