ఆ రోజు రాత్రి మొత్తం అలాగే.. భయపడిపోయాం.. జాతీయ అవార్డు గ్యారెంటీ: షాకింగ్ విషయాలు చెప్పిన రామ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. సరైన కంటెంట్ దొరికితే ఎలాంటి పాత్రలైనా చేయడానికి హీరోలు.. ఎంతటి ఖర్చునైనా భరించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్న కారణంగానే ఈ తరహా సినిమాలు పుడుతున్నాయి. ఇలా ఇప్పుడు రాబోతున్న చిత్రమే 'గాలి సంపత్'. విడుదలకు ముందే ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కొన్ని షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ముదురు భామ అందాలు మాములుగా లేవు: మాల్దీవుల్లో బాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

ఇద్దరూ ఇద్దరే.. అలా వస్తున్న ‘గాలి సంపత్'

ఇద్దరూ ఇద్దరే.. అలా వస్తున్న ‘గాలి సంపత్'

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'గాలి సంపత్'. అనిష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌ నటించింది.

‘గాలి సంపత్' ఎవరో ముందే రివీల్ చేశారుగా

‘గాలి సంపత్' ఎవరో ముందే రివీల్ చేశారుగా

'గాలి సంపత్' సినిమాను ప్రకటించిన సమయంలో ఇందులో టైటిల్ రోల్ చేసేది శ్రీ విష్ణు అని అంతా అనుకున్నారు. కానీ, ఆ పాత్రను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారని ఆ తర్వాతే తెలిసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఓ ప్రమాదంలో మాట కోల్పోయి.. గొంతు నుంచి గాలి మాత్రమే వదిలే ఓ వ్యక్తి కథతో ఇది రూపొందింది. అందుకే ఈ చిత్రానికి 'గాలి సంపత్' అనే టైటిల్ పెట్టారు.

సినిమా కథను కూడా అప్పుడే చూపించారు

సినిమా కథను కూడా అప్పుడే చూపించారు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవలే వదిలారు. 30 అడుగుల నుయ్యిలో మాటలు రాని గాలి సంపత్ పడిపోతే దానిలో నుంచి ఎలా బయటకు వస్తాడు అనే పాయింట్‌తోనే సినిమా నడుస్తుందని అందులో చూపించారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

అంచనాలను పెంచేసిన టీమ్... భారీ బిజినెస్

అంచనాలను పెంచేసిన టీమ్... భారీ బిజినెస్

ట్రైలర్‌లో కామెడీతో పాటు ఎమోషన్స్‌ను చూపించడంతో పాటు ఇద్దరు హీరోలు జీవించడంతో 'గాలి సంపత్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులోనూ ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. తద్వారా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

జాతీయ అవార్డు గ్యారెంటీ అన్న హీరో రామ్

జాతీయ అవార్డు గ్యారెంటీ అన్న హీరో రామ్

'గాలి సంపత్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేశాం. ఇందులో అద్భుతంగా నటించారు. నాకు తెలిసి ఈ చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డు వస్తుంది' అన్నాడు.

ఆ రాత్రి మొత్తం అలాగే.. భయపడిపోయాం

ఆ రాత్రి మొత్తం అలాగే.. భయపడిపోయాం

అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ కాకముందే అనిల్ నాతో పని చేశాడు. పటాస్ మూవీ ప్రారంభానికి ముందు రోజు రాత్రి.. 'పండగ చేస్కో' సినిమా కోసం నాతో ఉన్నాడు. ఉదయమే మొదటి సినిమా పూజ అయినప్పటికీ అర్ధరాత్రి వరకూ నాతో పని చేశాడు. మేమే భయపడిపోయి వెళ్లిపోమన్నా అతను వెళ్లలేదు. అది అనిల్ గొప్పదనం' అంటూ చెప్పుకొచ్చాడు రామ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X