Skanda New Release Date: స్కంద మూవీ రిలీజ్ వాయిదా.. రామ్ మూవీ ఎప్పుడంటే? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న 'స్కంద' ఒకటి. ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'స్కంద' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి కొన్ని బ్రేకులు వచ్చినా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలా ఇప్పటికే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతూనే ఉన్నారు.

Ram Pothineni Starrer Skanda Movie Release Postponed to September 28th

రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'స్కంద' సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించింది. దీంతో ఇప్పుడు యూనిట్ సభ్యులు ప్రచారం చిత్రాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌, ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేసేశారు.

'స్కంద' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో బిజినెస్ డీల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతునట్లు ప్రకటించారు.

Ram Pothineni Starrer Skanda Movie Release Postponed to September 28th

వాస్తవానికి సెప్టెంబర్ 28న ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ, అది అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై స్పష్టత మాత్రం రాలేదు. అలాంటిది ఇప్పుడు 'స్కంద' ఆరోజుకు వాయిదా పడడంతో 'సలార్' రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అయినట్లు తేలిపోయింది. ఇది రామ్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ కాగా.. ప్రభాస్ అభిమానులకు షాక్ తగిలినట్లైంది.

Ram Pothineni Starrer Skanda Movie Release Postponed to September 28th

ఇక, బోయపాటి శ్రీను - రామ్ పోతినేని చేసిన 'స్కంద' సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X