Skanda Trailer: రామ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. స్కంద ట్రైలర్ వచ్చేది ఆరోజే
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరికి మాత్రమే ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ కూడా భారీ స్థాయిలో ఉంది. అలాంటి వారిలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చిన ఈ హ్యాండ్సమ్ గాయ్.. తనదైన చిత్రాలతో తక్కువ సమయంలోనే మీడియం రేంజ్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.
'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్న రామ్ పోతినేని.. ఇప్పుడు 'స్కంద' అనే సినిమాలో నటిస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'స్కంద' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి కొన్ని బ్రేకులు వచ్చినా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలా ఇప్పటికే దాదాపుగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు.
రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతోన్న 'స్కంద' సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఇప్పుడు చిత్ర నిర్మాతలు ప్రచారం చిత్రాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌తో పాటు రెండు పాటలను వదిలారు. ఇప్పుడు ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ చేశారు.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'స్కంద' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఆగస్టు 26వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, దీన్ని లాంచ్ చేసేందుకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఓ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతున్నట్లు తెలిసింది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.
ఇదిలా ఉండగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న 'స్కంద' సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











