The Warrior Teaser: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ ఊచకోత.. మామూలుగా లేదుగా!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరో పవర్ఫుల్ సినిమాతో విజిల్స్ వేయించేందుకు రెడీ అవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి రామ్ తన స్టైల్ ను పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వచ్చిన రెడ్ సినిమా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రామ్ ది వారియర్ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ పోతినేని ఈసారి మాస్ యాక్షన్ డోస్ మరింత పెంచాడు అనిపిస్తోంది. ఈ పోలిసోళ్ల టార్చర్ తట్టుకోలేక పోతున్నాం. సైలెంట్ గా ఉండేటోళ్లు ఇప్పుడు వైలేంట్ గా లోపల వేస్తున్నారు అనే డైలాగ్ తో హీరో క్యారెక్టర్ పరిచయం అయిన విధానం అద్భుతంగా ఉంది. రామ్ పోతినేని గతంలో ఎప్పుడు లేని విధంగా కోర మీసాలగో కంప్లీట్ గా కొత్తగా కనిపిస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కొత్తగా పవర్ఫుల్ గా ఉంది.

Ram pothineni The warrior movie powerful telugu Teaser

ఈ సినిమాలో రామ్ సత్య అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య సత్య అనే వాడు ఒకడు వచ్చాడు. ఒక్కొక్కడికి పెడుతున్నాడు అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ వస్తుండగా రామ్ పోలీస్ ఆఫీసర్ గా ఊచకోత కోయడం.. అలాగే హీరోయిన్ కృతి శెట్టి విజిల్స్ వేయడం కూడా చాలా మాస్ గా ఉంది. ఈజీగా ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.

అలాగే కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇస్తాడాని.. అట్ట కొడతాడు.. అట్ట టాబ్లెట్ వేస్తాడు అని చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ గా ఉంది. చూస్తుంటే దర్శకుడు లింగుస్వామి రామ్ ను పూర్తి స్థాయిలో మాస్ పాత్రలో ప్రజెంట్ చేస్తూ మరింత పవర్ఫుల్ గా చూపించేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ కూడా హీరోకు తగ్గ మాస్ పాత్రలో సత్య పోరిని నేను అంటూ ఆకట్టుకుంటోంది.

ఇక హీరో అంత పవర్ఫుల్ గా ఉంటే.. విలన్ కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ ఉండబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు. ఆట బాగుంది కదా ఆడేద్దం అంటూ షాక్ ఇచ్చాడు. ఇక మరోవైపు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలుస్తోంది. ఇక విలన్ కు పోటీగా రామ్ పాన్ ఇండియా సినిమాలు చూసుంటారు.. పాన్ ఇండియా విలన్స్ ను చేస్తారా అని కౌంటర్ ఇచ్చిన విధానం కూడా కొత్తగా ఉంది. అలాగే మై డియర్ గ్యాంగ్ స్టర్స్ వీలైతే మారిపోండి లేదంటే పారిపోండి.. ఇదే ఫైనల్ వార్నింగ్ అనడం కూడా హైలెట్ గా ఉంది. మొత్తంగా సినిమా అయితే ఊహించిన దానికంటే పవర్ఫుల్ మాస్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది. మరి ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X