హీరో రామ్‌కు అరుదైన ఛాన్స్.. యువ హీరోల్లో ఎవరికీ దక్కని అవకాశం.. రియల్ AK47తో క్రేజీగా..

వెండితెర మీద డమ్మీ తుపాకులతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరో చేతికి అసలైన తుపాకి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అవకాశం మన ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వచ్చింది. రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

ఇక అలాంటి అవకాశం వస్తే ఈ ఎనర్జిటిక్ స్టార్ ఎలా ఊరుకుంటారు. గన్ చేతికి తీసుకుని ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్ అవుతుందో తెలుసుకున్నారు. తన సినిమాలకు బాగా పనికి వస్తుందనుకుని ఆయుధాలకు సంబంధించిన సమాచారమంతా అడిగిమరీ తెలుసుకున్నారు. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47.. ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం తెలుసుకోవడమే కాకుండా, వాటిని చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు. షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రయోగం కూడా చేశారు.

Ram Pothineni With Real Gun in A Private Event

గన్ చేతిలోకి తీసుకున్న అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ.. ''అరుదైన అనుభవమిది. సినిమా లాగా లేదు. చాలా కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థ వారికి థాంక్స్ చెబుతున్నా'' అన్నారు. ఈ సంస్థ ఎండీ, ఛైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్‌ను జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ప్రెసిడెంట్ కిషోర్ దత్ అట్లూరి, బిజినెస్ హెడ్ రవికుమార్ చెన్నా తదితరులు తమ కార్యక్రమానికి హాజరైనందుకు రామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్.. ప్రస్తుతం RED సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ డిఫెరెంట్ లుక్ ఇప్పటికే వైరల్ అయింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X