twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక రెడ్డి హత్య.. అమ్మాయిలకు శ్రీముఖి సలహా.. అలాంటి తీర్పుతోనే మార్పు..

    |

    నగర శివారులో జరిగిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అన్ని రంగాల ప్రముఖులు ఈ దుర్ఘటనపై స్పందిస్తూ.. ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ప్రియాంక రెడ్డి ఘటనకు సంబంధమున్న ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక రెడ్డి హత్యపై ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు స్పందించగా.. తాజాగా మరికొంత మంది రియాక్ట్ అయ్యారు.

    మరోసారి రుచి చూపించాలి..


    ప్రియాంకకు జరిగిన ఘటనతో నేనెంత బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేరాలను ఆపడానికి చట్టాలు, పోలీసులున్నారు కానీ ఇలాంటి జంతువులను కాదు. వీరందరికి మరోసారి చట్టాలు, శిక్షలు ఎలా ఉంటాయో రుచి చూపించాలని రవితేజ ట్వీట్ చేశాడు.

    తక్షణ శిక్ష..

    ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షిస్తే కనీసం.. కొందరికైనా నమ్మకం వస్తుందని, దీన్ని ముందుగా పరిగణలోకి తీసుకోండని కేటీఆర్, హైద్రాబాద్ పోలీసులను హరీష్ శంకర్ కోరాడు.

    పోలీసులకు ఫోన్ చేయండి..

    ఏ అమ్మాయికైనా ఎవరిపైన అయినా అనుమానం వస్తే పోలీసులకు ఫోన్ చేయండని, బయటకు వెళ్లేటప్పుడు ట్రాకింగ్ యాప్‌లాంటివి వాడాలని, ఎవరోకరికి నిత్యం అప్‌డేట్ చేస్తూ ఉండాలని సలహా ఇచ్చింది. అపరిచితులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండని, ప్రియాంకకు జరిగింది విని షాక్ అయ్యానని, ప్రతీ అమ్మాయి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2

    భయం కలిగించే తీర్పు..

    ఇలా చేయాలనే ఓ ఆలోచన వస్తే.. భయం వేసేలా ఓ తీర్పు.. అప్పటిదాకా రాదు వీళ్లలో మార్పు ఎంతో ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. ప్రియాంకకు న్యాయం జరగాలి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.

    English summary
    Ram, Raviteja And Sreemukhi Reaction On Priyanka Reddy Murder. No reaction can explain the pain I felt hearing what happened to Priyanka. Laws and police are there to control crimes but not animals. Creating enough awareness regarding punishments is much needed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X