twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RED సెన్సార్ పూర్తి.. సంక్రాంతి బరిలో ఇస్మార్ హీరో

    |

    ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇస్మార్ట్ సినిమా ఇచ్చిన విజయం అటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఇటు హీరో రామ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారింది. అలా గతేడాది ఇస్మార్ట్‌గా బాక్సాఫీస్‌ మీద దాడి చేసిన రామ్.. ఈ ఏడాది కూడా రికార్డులు కొల్లగొట్టాలని చూశాడు.కానీ కరోనా లాక్డౌన్ మూలానా రామ్ సినిమా వాయిదా పడింది. తమిళ మూవీ రీమేక్‌గా రాబోతోన్న RED సినిమా కోసం రామ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

    ఆ మధ్య RED సినిమాపై రకరకాలుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. RED చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ రూమర్లు వచ్చాయి. వాటిని రామ్ తీవ్రంగా ఖండించాడు. సినిమాను తాము వ్యాపారంగా చూడటం లేదని, RED సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని గట్టిగా చెప్పాడు. మొత్తానికి RED సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్థిఫికెట్‌ను జారీ చేశారు.

    Ram RED Censor Completed and release On 14th January

    నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ.. ఈరోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది . 'దేవదాసు', 'మస్కా' తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో... ఈ అంశాలన్నీ సినిమాలోఉంటాయి.'ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, 'రెడ్'కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు.

    థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశామని అన్నాడు. జనవరి 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించేశారు.

    English summary
    Ram RED Censor Completed and release On 14th January..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X