RED అప్‌డేట్ : పాటలన్నీ పూర్తి.. ఒకే ఒక్క షెడ్యూల్ మిగిలిందట
ఇస్మార్ట్ శంకర్‌తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంతో అటు రామ్, ఇటు పూరీ కెరీర్ గాడిలో పడింది. దీంతో ఈ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. రామ్ కిషోర్ తిరుమలతో రెడ్ సినిమాను చేస్తుండగా.. పూరీ జగన్నాద్ విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు.
ఇప్పటికే రామ్ RED మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. టైటిల్ ప్రకటించి సినిమాను ప్రారంభించిన రోజే.. విడుదల తేదీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి తగ్గట్టే సినిమాను చకచకా ముగించేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

తాజాగా ఈ మూవీలోని సాంగ్‌ను ఇటలీలో షూట్ చేసినట్టు.. అక్కడి నుంచి చిత్రయూనిట్ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక ఒక ఒకే షెడ్యూల్ మిగిలిపోయిందని, అది హైద్రాబాద్‌లోనే ఉంటుందని సమాచారం. అన్ని పనులు అనుకున్న సమయానికే పూర్తి చేసి.. ముందుగా ఫిక్స్ చేసిన తేదీకే (ఏప్రిల్ 9) థియేటర్లలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











