రామ్ సినిమాకు కొత్త చిక్కులు… లింగుస్వామి మీద ఫిర్యాదు చేసిన నిర్మాత!
హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చాడు.. అయితే ఆ తర్వాత ఆయన చేసిన రెడ్ అనే ప్రయోగాత్మక సినిమా మళ్లీ నిరాశపరిచింది. నేను శైలజ సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో రెడ్ సినిమా చేయగా ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రామ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.
ఇప్పటికే ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఆ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడిందని అంటున్నారు. దర్శకుడు లింగుస్వామి, తమిళ నిర్మాత జ్ఞానవేల్ మధ్య ఆర్థిక లావాదేవీలు కొన్ని ఉన్నాయి. ఈ అంశం మీద జ్ఞానవేల్ రాజా గతంలోనే ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. అంతే క్కాక ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న వివాదంపై తాము స్పందించమంటూ తమిళ సంఘం తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తున్న క్రమంలో జ్ఞానవేల్ డైరెక్టర్ లింగుస్వామిపై ఈ సారి తెలుగు ఛాంబర్ లో మళ్ళీ ఫిర్యాదు చేశారని అంటున్నారు.

పాత సినిమా విషయంలో తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు తేల్చకుండా మరో సినిమా డైరెక్ట్ చేస్తున్న లింగుస్వామి విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే రామ్ సినిమా ప్రారంభానికి ముందే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా కథ పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని అంటున్నారు. రామ్ కి కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ బాగా నచ్చడంతో కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైన సంగతి తెలిసిందే. కాస్త కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











