అరవింద సమేత సినిమా కాదు శాంతి సందేశం.. రిలీజ్ రోజు భూమి బద్ధలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం గురించి రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తమన్‌తో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. పనిచేసేటప్పుడు అతని కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. ఈ సినిమా కోసం 100 పీస్ ఆర్కెస్ట్రాను వాడారు. సినిమాకు మ్యూజిక్ వెన్నుముకగా నిలిచింది. తమన్ ప్రాణం పెట్టి చేశాడు అని రామజోగయ్యశాస్త్రి అన్నారు.

నిర్మాత చినబాబు నిర్మించే సినిమాలో పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. అరవింద సమేత రిలీజయ్యే రోజు అక్టోబర్ 11న భూమి బద్ధలు అవుతుంది అని రామజోగయ్యశాస్త్రి జోస్యం చెప్పారు. కొన్ని పాటలు మన పేరు మీద రాసి పెట్టి ఉంటాయి. అలాంటి మంచి పాట 'పెనిమిటి' పాట. మంచి పాట రాశాననే సంతృప్తి నాకు ఎప్పుడూ ఉంది అని అన్నారు.

నా ప్రియ తమ్ముడు ఎన్టీఆర్, త్రివిక్రముడు కలిసి చేస్తున్న ఈ సినిమా ఓ శాంతి సందేశాన్ని అందిస్తున్నట్టు ఉంది. ఈ చిత్రంతో త్రివిక్రమ్ సంచలన విజయాన్ని చేజిక్కించుకొంటాడు అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











