Saindhav Pre Release Event: సైంధవ్ డైరెక్టర్‌పై రామజోగయ్య శాస్త్రి అసంతృప్తి.. స్టేజీమీదే ఇది కరెక్టు కాదంటూ..
సంక్రాంతి పండగ ఉత్సాహం మరో రేంజ్ లో ఉండనుంది. మామూలుగానే సంక్రాంతి అంటే ఉరకలేసే ఉత్సాహం ఉంటుంది. ఈ సారి మాత్రం ఆ జోష్ డబుల్ కానుంది. సినీ ప్రేక్షకులు మాత్రం నిజంగా పండగ చేసుకునే సందర్భం కానుంది. సైంధవ్, గుంటూరు కారం, నాసామిరంగ, హను-మాన్ చిత్రాలు 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా సైంధవ్ చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. వైజాగ్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొంది.
ప్రీరిలీజ్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, కీలక నటీనటులతో పాటు, పలువురు టెక్నీషియన్లు స్టేజ్ పై మాట్లాడారు. ఈ సినిమాలోని పాటలకు సీనియర్ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పాటలు అందించిన విషయం తెలిసిందే. హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలనుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వైజాగ్ కు వస్తే ఇలాగా చేసేది అంటూ స్టేజ్‌పై తన అసంతృప్తిని వెల్లడించారు. రామజోగయ్య శాస్త్రి మాటలతో ఒక్కసారిగా షాక్‌కు గురైన డైరెక్టర్ వెంటనే శాస్త్రి కాళ్లపై పడి క్షమించమని అడిగారు.

దానికి వెంకటేష్ బదులిస్తూ.. డైరెక్టర్ చేసింది కరెక్టు కాదని, క్షమించడానికి వీల్లేదని తన అభిప్రాయాన్ని చెప్పారు. డైరెక్టర్ శైలేష్ ను శిక్షించాల్సిందేనని రామజోగయ్య శాస్త్రి అనగా.. దానికి విక్టరీ వెంకటేష్ కూడా సరేనన్నారు. అంతకుముందు ఏం జరిగిందంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా గురించి డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పుకొచ్చారు. సినిమా విశేషాలతో పాటు ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్ల గురించి, నటించిన నటీనటుల గురించి చెప్పారు. అందరూ చాలా బాగా చేశారని, ఎంతో కష్టపడి, పనిని ఇష్టపడి చేసిన సినిమా అని, ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఈ సమయంలో సైంధవ్ మూవీలోని పాటలకు లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి గురించి ప్రస్తావించడం మర్చిపోయారు డైరెక్టర్. ఆఖర్లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి తన వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెవిలో చెప్పారు. తాను హైదరాబాద్ నుంచి ఈ ఈవెంట్ కోసం వైజాగ్ కు వస్తే తన పేరు మర్చిపోతారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న శైలేష్ కొలను వెంటనే రామజోగయ్య శాస్త్రి కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగారు.

ఆ వెంటనే డైరెక్టర్ ను శిక్షించాల్సిందేనని, తప్పనిసరిగా పనిష్‌మెంట్ ఇవ్వాలని వెంకీతో అన్నారు. దానికి వెంకీ కూడా సరే అన్నారు. డైరెక్టర్‌తో పాట పాడించాలని, అదే తనకు వేసే శిక్ష అని అన్నారు శాస్త్రి. రామజోగయ్య శాస్త్రి అడిగినట్లుగా డైరెక్టర్ శైలేష్ కొలను సైంధవ్ మూవీలోని బుజ్జి కొండ పాట పాడారు. వెంటనే రామజోగయ్య శాస్త్రి రాగాన్ని అందుకుని పాటను కొనసాగించారు.


Click it and Unblock the Notifications











