డీడీ నేషనల్‌లో శ్రీకృష్ణ సీరియల్.. రామాయణం తర్వాత ప్రేక్షకుల చెంతకు..
కరోనావైరస్ సమయంలో గృహ నిర్బంధంలో ఉంటున్న ప్రజలకు కాస్త వినోదం కలిగించడానికి టెలివిజన్ చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలను తెరపైకి తీసుకొచ్చారు. గతంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్‌ను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు.
గతంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను టెలివిజన్లకు హత్తుకొనేలా చేసిన రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణాన్ని రోజుకు రెండుస్లారు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ప్రస్తుతం రామానంద్ సాగర్ రూపొందించిన శ్రీకృష్ణ టెలివిజన్ సీరియల్‌ను కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

శ్రీకృష్ణ టెలివిజన్ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నట్టు ప్రసార భారతీ, దూరదర్శన్ తన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తెలిపారు. గోవర్ధనగిరిని ఎత్తుతున్న కృష్ణుడి సీన్‌ను ప్రోమోగా విడుదల చేశారు. ఇంకా డీడీ నేషనల్‌లో ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రామాయణం సీరియల్ ఉదయం 9 గంటలకు ఒకసారి, మళ్లీ రాత్రి 9 గంటలకు మరోసారి ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో శ్రీకృష్ణ సీరియల్‌ను కూడా అందించాలనే ఆలోచనకు వచ్చారు. 221 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్‌లో బాలకృష్ణుడిగా స్వప్నిల్ జోషి, యువ కృష్ణుడిగా సర్వదమన్ బెనర్జీ కనిపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications