Ramarao On Duty trailer review శరత్ మండవ టేకింగ్.. మాస్ మహారాజా రవితేజ ఫెర్ఫార్మెన్స్
విభిన్నమైన కథ, కథనాలు, విలక్షణమైన టేకింగ్‌తో ఆకట్టుకొంటున్న దర్శకుడు శరత్ మండవ దర్శకత్వలో మాస్ మహారాజా రవితేజ, మజిలీ ఫేమ్ దివ్యషా కౌశిక్ జంటగా తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. మైనింగ్ మాఫియా, సీరియల్ హత్యల కథాంశంతో ఆసక్తికరంగా తెరకెక్కినట్టు తాజాగా రిలీజైన రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ సంకేతాలిచ్చింది. ఈ ట్రైలర్‌లో అంశాలు, విషయాలు ప్రేక్షకులపై ఆసక్తిని రేపేలా ఉన్నాయంటే..

ఇంట్రెస్ట్ ఎలిమింట్స్‌తో శరత్ మండవ
దర్శకుడు శరత్ మండవ రాసుకొన్న కథ ఇంట్రెస్ట్‌ను కలిగించేలా ఉందనే విషయం ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఆయన డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు కొత్తగా తెర మీద కనిపించాయి. రవితేజ లాంటి మాస్ హీరోతో అంతే మొత్తంలో కనిపించే మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథను తెరకెక్కించినట్టు స్పష్టత కనిపించింది. అయితే శరత్ మండవ మరోసారి ఛాలెంజింగ్ కథతో వస్తున్నాడనే విషయం ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది.

రొటీన్‌కు భిన్నంగా రవితేజ
మామూలు కథతోనే మ్యాజిక్ చేసే మాస్ మహారాజా రవితేజ ఈసారి రొటీన్‌కు భిన్నమైన సినిమాతో వస్తున్నట్టు ట్రైలర్ తెలియజేసింది. గవర్నమెంట్ ఉద్యోగి డ్యూటీ మైండ్‌తో రంగంలోకి దిగితే ఏం జరుగుతుందనే అంశాలను ట్రైలర్‌లో దర్శకుడు శరత్ మండవ రుచి చూపించారు. ఓ అధికారి ప్రభుత్వంగా మారితే.. తానే చట్టమైతే శిక్ష ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కేవలం సీరియస్‌గానే కాకుండా ఫ్యామిలీ, రొమాంటిక్, మానవీయ విలువలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

సెంటిమెంట్, ఎమోషనల్ సంఘటనలతో
ట్రైలర్‌లో మైనింగ్‌లో మనుషులు తప్పిపోవడం.. తప్పిపోయిన తన నాన్నను వెతికిస్తారా అనే ఓ పాప ధీనంగా అభ్యర్థించడం సెంటిమెంట్ రేంజ్‌ను తెలిపింది. అన్యాయంపై అధికారి పోరాటానికి రంగంలోకి దిగితే.. పోలీసులు సైతం ఫ్యాన్స్‌గా మారే అవకాశం ఉందనే విషయాలు ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపించాయి.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, శామ్ సీఎస్ బీజీఎం, మ్యూజిక్ ట్రైలర్‌లోనే ఆకట్టుకొన్నాయి. సాహి సురేష్ ఆర్ట్ పనితనం ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు పుష్కలంగా కనిపించాయి. ఈ విషయాలన్నీ సినిమాను చూడాలనే ఆసక్తిని పెంచాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రవితేజ, దివ్యషా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపుడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖవాణి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్టీ టీమ్ వర్క్స్
మ్యూజిక్ డైరెక్టర్: శామ్ సీఎస్
సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
రిలీజ్ డేట్: 2022-07-29


Click it and Unblock the Notifications











