Ramayana Trailer Review: రామాయణం ట్రైలర్ రివ్యూ

ఇండియన్ స్టార్ యాక్టర్లు రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీడియోల్, అమితాబ్ బచ్చన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు నటిస్తున్న చిత్రం రామాయణం. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్, అట్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌పై సినిమాను నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్క్ ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లో సినిమాటోగ్రఫి: పంకజ్ కుమార్, మహేష్ లిమయే, మ్యూజిక్: హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్ తమ బాధ్యతలను నిర్వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను 3డీ ఫార్మాట్‌లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఆవిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలోరా గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

Ramayanam Trailer Review

రామాయణం ట్రైలర్ విషయానికి వస్తే.. మనకు తెలిసిన కథనే సాంకేతికంగా మరింత బలంగా చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. సీతగా సాయిపల్లవి, రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యష్ పాత్రల పరిచయం చేశారు. 3డీ ఫార్మాట్‌లో ప్రదర్శించిన ఈ ట్రైలర్‌లో టెక్నికల్ అంశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. బిగ్ స్క్రీన్ మీద కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుందనే ఫీలింగ్‌ను ప్రాథమికంగా క్రియేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంటుందని శాంపిల్‌గా ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు. దర్శకుడు నితీష్ తివారీ తనకు ఎదురైన ఛాలెంజ్‌లను సమర్ధవంతంగా హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యారనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది. నిర్మాత నమిత్ మల్హోత్రా డ్రీమ్ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదనే విషయం ప్రొడక్షన్ వాల్యూస్ తెలిపాయి.

ట్రైలర్‌లో సీతగా సాయిపల్లవి, రాముడిగా రణ్ బీర్ తన మార్కు బాడీ లాంగ్వేజ్ కాకుండా పాత్రలో ఒదిగిపోయినట్టు కనిపించారు. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారా? అనేది సినిమా పూర్తిగా చూస్తే గానీ అర్ధం కాదు. ఇక ఈ ట్రైలర్ వన్ మ్యాన్ షో యష్. రావణుడిగా ఉగ్రరూపంతో చెలరేగిపోయారు. అహంకారపూర్తిమైన డైలాగ్‌తో ఆకట్టుకొన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్ఫణఖగా గ్లింప్స్‌గా కనిపించింది. ఓవరాల్‌గా పాత్రల పరిచయం, కథ, కథనాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా టెక్నికల్‌గా గతంలో వచ్చిన విమర్శలకు చోటు ఇవ్వకుండా క్వాలిటీ, కంటెంట్‌తో ట్రైలర్‌ను అందించారని చెప్పొచ్చు.

ఈ ట్రైలర్‌ను అధికారికంగా 23వ తేదీన అమెరికాలోని ఓ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తారు. అనంతరం ఈ ట్రైలర్ సాధారణ ప్రేక్షకులకు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అందుబాటులోకి వస్తుందని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పారు. భారతీయ చరిత్రలో స్పూర్తిదాయకమైన ఎపిక్ పాత్రలు సీతా, రాముడు క్యారెక్టర్లను పోషించడం జన్మధన్యమైంది. ఆ మహనీయులే మమ్మల్ని ఎంచుకొన్నారు. వారే మాతో నటింప జేయించారు. మేము ఈ పాత్రల కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు అని సాయిపల్లవి, రణ్ బీర్ కపూర్ తెలిపారు.

Read more about: ramayanam sai pallavi yash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X