స్టేట్ బడ్జెట్ రేంజ్‌లో రామాయణ బడ్జెట్.. ఇండియాలోనే కాస్ట్ లీ మూవీగా!ఎన్ని వేల కోట్లో తెలుసా?
నటీనటుల పారితోషికాలు, టెక్నికల్ స్టాండర్డ్స్, నిర్మాణ విలువలు పెరుగుతుండటంతో సినిమాల బడ్జెట్ నానాటికీ పెరిగిపోతోంది. భారీ స్టార్ క్యాస్టింగ్, పాటల చిత్రీకరణ, ప్రమోషనల్ కార్యక్రమాలు దీనికి అదనం. ప్రస్తుతం మనదేశంలో పాన్ ఇండియా కల్చర్ మొదలయ్యాక.. సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు, బిజినెస్ చేసుకునేందుకు పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను బుక్ చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు భారీ చిత్రాల వెంటపడుతుండటంతో నిర్మాతల జేబులు చిల్లులు పడుతున్నాయి.
హాలీవుడ్ రేంజ్‌కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్, పరిధి నానాటికీ విస్తరిస్తూ హాలీవుడ్ రేంజ్‌కి చేరుకుంటోంది. కాస్త ప్రోత్సహం దొరికితే హాలీవుడ్ మేకర్స్‌ని మించి విజువల్ వండర్స్ క్రియేట్ చేయగలమని నిరూపిస్తున్నారు మేకర్స్. గతంలో 100 కోట్లతో సినిమాలు తీయడానికే మన సినీ ప్రముఖులు నానాతంటాడు పడేవారు. అంత పెట్టి తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? సినిమాకు బిజినెస్ జరుగుతుందా? అనే అనుమానాలు వేధించేవి. ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ దక్షిణాదిన భారీ చిత్రాలు రూపొందుతున్నాయి. బాహుబలి, పుష్ప, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపించాయి.

భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ 29
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం ఏకంగా 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఇండియాలోనే కాస్ట్ లీ మూవీ అనిపించుకునేందుకు సిద్ధమైంది. అయితే సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్‌లోనూ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఎస్ఎస్ఎంబీ 29 రికార్డును బద్ధలు కొట్టడానికి భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే రామాయణ. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రావణాసురిడిగా కన్నడ స్టార్ హీరో యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్, కైకేయిగా లారాదత్త, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.
చరిత్ర సృష్టించిన రామాయణ
రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తొలి నుంచి గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తొలుత 830 కోట్లు, తర్వాత 1600 కోట్లతో రామాయణ తీస్తున్నారని గాసిప్స్ వచ్చాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత నమిన్ మల్హోత్రా ఆ పుకార్లకు తెరదించుతూ బాంబు పేల్చారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఎన్నడూ లేని విధంగా 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచం ఇండియా వైపు చూడాల్సిందే
దీనికి కావాల్సిన నిధులను తాము సమకూర్చుకుంటున్నామని.. ఎవరి నుంచి ఆశించడం లేదని నమిత్ స్పష్టం చేశారు. రామాయణ స్క్రిప్ట్ వర్క్‌ను ఏడేళ్ల క్రితమే ప్రారంభించామని.. ఏ భారతీయ సినిమా కూడా దీని సమీపంలోకి కూడా రాలేదన్నారు. ప్రపంచమంతా దీనిని చూడాలనే ఉద్దేశంతోనే భారీ స్థాయిలో నిర్మిస్తున్నామని నమిత్ స్పష్టం చేశారు. రామాయణతో ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందని ఆమన ఆకాంక్షించారు. ఆయన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. స్టేట్ బడ్జెట్ రేంజ్‌లో సినిమా తీస్తున్నారని మెచ్చుకుంటున్నారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశంలో కాస్ట్ లీ మూవీగా రామాయణ చరిత్ర సృష్టించనుంది.


Click it and Unblock the Notifications











