యాక్షన్ సీక్వెన్స్‌లో రవితేజ దూకుడు.. ఖిలాడీపై డైరెక్టర్ కామెంట్స్
మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇన్నాళ్ల లెక్కలన్నీ సెట్ చేసేశాడు. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు, డిజాస్టర్లు పలకరించినా కూడా రవితేజ తన నమ్మకాన్ని వదిలిపెట్టుకోలేదు. సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే వచ్చాడు. చివరకు క్రాక్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ దుమ్ములేపేసింది.
విడుదల విషయంలో వివాదాం నెలకొన్నా కూడా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.
క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రవితేజ మరింత ఉత్తేజంతో ఖిలాడీ షూటింగ్‌ను ప్రారంభించాడు. క్రాక్ తరువాత రవితేజ మీద అంచనాలు పెరగడంతో ఖిలాడీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారట. బడ్జెట్, కథ అన్నింట్లోనూ మార్పులు చేసుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే వదలిన ఖిలాడీ మోషన్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఇక ఖిలాడీతో మరో హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఖిలాడీ టీం ఇటలీలో సందడి చేస్తోంది. గత రెండు మూడు వారాలుగా రవితేజ అక్కడే ఉన్నాడు. రవితేజ మీద అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నానని డైరెక్టర్ రమేష్ వర్మ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన లొకేషన్స్ నుంచి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. రవితేజ తన హై లెవెల్ ఎనర్జీ పర్ఫామెన్సతో యాక్షన్ సీక్వెన్స్‌ను ఇరగ్గొట్టేస్తున్నాడని, ఈ నెల చివరి వరకు ఇక్కడే షూట్ చేయనున్నామని చెప్పుకొచ్చాడు. త్వరలోనే షూటింగ్ ముగించేసి సినిమాను మే 28న రిలీజ్ చేస్తామని తెలిపాడు.


Click it and Unblock the Notifications











