బాలీవుడ్‌కి వెళ్లనున్న రాక్షసుడు.. ఆ దర్శకుడికి లక్కీ ఛాన్స్
ప్రస్తుతం దేశమంతా టాలీవుడ్ వైపు చూస్తోంది. రాజమౌళి, ప్రభాస్ వంటి వారి వల్ల తెలుగు చిత్ర సీమ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ కమ్రంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు కథలు పరిగెడుతున్నాయి. ఇక్కడ వచ్చిన సినిమాలను అక్కడ రీమేక్ చేస్తున్నారు. రీమేక్ చేయడమేమీ కొత్త కాదు. మనం వేరే భాషల సినిమాలను ఇక్కడ రీమేక్ చేయడం, ఇక్కడ సినిమాలను వేరే వారు రీమేక్ చేయడం సర్వసాధారణం.
కానీ ఈ మధ్య మాత్రం ఎక్కువగా తెలుగు సినిమాలు హిందీకి పయనమవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి, జెర్సీ వంటివి బాలీవుడ్‌లోకి వెళ్లాయి. ఇక ఈ మధ్యే హిట్ చిత్రం కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. అల వైకుంఠపురములో, దూకుడు వంటి చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ఇక తాజాగా మరో చిత్రం కూడా లైన్ కట్టింది.అయితే అది మన సొంత సినిమా కాదు. మనవాళ్లు తమిళం నుంచి తీసుకుని ఇక్కడ రీమేక్ చేయగా.. ఇక్కడి నుంచి బాలీవుడ్‌కు వెళ్తోంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ రీమేక్ చేశాడు. ఇక ఈ సినిమా బెల్లంకొండకు సరైన విజయాన్ని రుచిచూపించింది. రమేష్ వర్మకు కూడా మంచి పేరే వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ రీమేక్ బాధ్యతలు రమేష్ వర్మపైనే పెట్టబోతోన్నారట. అయితే రవితేజతో సినిమాను పూర్తి చేశాకే ఈ రీమేక్‌ను ముట్టుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి దర్శకుడిగా రమేష్ వర్మకు రాక్షసుడు బాగానే కలిసి వచ్చేట్టు ఉంది.


Click it and Unblock the Notifications











