twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరద బాధితుల కోసం భారీ విరాళం అందించిన రామోజీరావు

    |

    హైదరాబాద్ నగరం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వందల కోట్ల ప్రభుత్వ ఆస్తులతో పాటు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ నగరాన్ని ఒక భారీ వర్షాన్ని చూసినట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కష్ట కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు వారికి తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు.

    ఇక ప్రముఖ ఈటీవీ వ్యవస్థాపకుడు, రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రామోజీ రావు కూడా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సీఎం సహాయక నిధి కోసం రూ.5కోట్లను విరాళంగా ప్రకటించారు. ఆయన బాటలోనే మరికొందరు అగ్ర వ్యాపార వేత్తలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. మొదట నందమూరి బాలకృష్ణ కోటిన్నర రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి అంధించగా ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు విడివిడిగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు.

    Ramoji Rao has donated 5 crores to the CMRF today

    అదే బాటలో అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు 50లక్షల రూపాయలు అందించారు. దర్శకులు, నిర్మాతలు అనే కాకుండా టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి పెద్ద మొత్తాన్ని సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నారు.

    రామోజీ రావు ఈ రోజు సిఎంఆర్‌ఎఫ్‌కు 5 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజంగా ఇది పెద్ద విరాళమనే చెప్పాలి. నిరుపేదలకు సహాయం చేయడంలో ప్రభుత్వానికి ఖచ్చితంగా సహాయం చేస్తుందని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

    English summary
    Heavy rains and floods have devastated the life of people in Hyderabad. Appreciate the efforts of Telangana Govt in releasing 550 crores for immediate relief. Standing by the cause, will contribute 50 lakhs to Telangana CM relief fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X