Last Rites: రామోజీ రావు అంత్యక్రియల్లో ఏపీ సర్కార్ ట్విస్ట్.. ఈనాడు అధినేత అంతిమ సంస్కారాలు ఎప్పుడు? ఎక్కడంటే?
తెలుగు పత్రికా రంగాన్ని ఉన్నత స్థానానికి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం దిగ్బ్రాంతిని కలిగింది. ఆయన ఇకలేరనే వార్త తెలుగు పాఠకులకు, సాహిత్య అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులను విషాదంలోకి నెట్టింది. ఆయనకు అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. అయితే ఆయన అత్యక్రియలను కూడా భారీగా, ఆయన స్థాయికి తగినట్టుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
రామోజీరావు గత కొద్దికాలంగా హృదయ, అలాగే వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా ఆయన ఇంటికే పరిమతమై చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. అయితే అనూహ్యంగా ఆయన శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

రామోజీ రావు పార్థీవ దేహాన్ని హాస్పిటల్ నుంచి రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడే అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఉదయం నుంచి వేలాది మంది సాధారణ పౌరులు, ఈనాడు సిబ్బంది, సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా వచ్చి శ్రద్దాంజలి ఘటించారు.
ఇక రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. ఆయన చివరి యాత్రకు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు భారీగా వస్తుండటంతో సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. పోలీస్ గౌరవ వందనంతో ఆయన అంతిమ సంస్కారాలను పూర్తి చేసేందుకు అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారిక లాంచనాలతో ఆయనకు చివరి వందనం సమర్పించేందుకు తమ రాష్ట్రం తరఫున పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఏపి ప్రభుత్వం తరఫున కడసారి నివాళులు అర్పించేందుకు... ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ల బృందాన్బి రామోజీ ఫిల్మ్ సిటీకి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో రెండు ప్రభుత్వాలు అధికారిక లాంఛనాలతో ప్రముఖుడికి అంతిమ సంస్కారం నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉండగా, తాను బతికి ఉండగానే.. రామోజీ రావు తన స్మారక మందిరాన్ని నిర్మించుకొన్నారు. దాంతో ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం వేద పండితులు, అధికారులు, ప్రభుత్వ పోలీసుల గౌరవ వందనంతో రామోజీ ఫిలిం సిటీలోని స్మారక మందిరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. రామోజీరావు పార్థీవ దేహాన్ని కేంద్ర కార్యాలయం నుంచి నివాసానికి రాత్రి తరలించారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు నివాసంలోనే ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 9 గంటల తర్వాత రామోజీరావు అంతిమయాత్ర మొదలవుతుంది. నివాసం నుంచి ఎంసిటీలోని స్మృతి వనం వరకు యాత్ర కొనసాగుతుంది. ఎంసిటీలోని స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఈ అంత్యక్రియలకు సినీ, రాజకీయ, పత్రిక, మీడియా ప్రముఖులు హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











