For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛార్మిని అంత మాట అనేసిన రమ్యకృష్ణ.. ఇది స్నేహమా? లేక వైరమా?

|

నిజ జీవితంలో కొందరి మధ్య అమితమైన స్నేహం, మరికొందరి మధ్య వైరం ఉండటం అనేది సర్వసాధారణం. దీనికి చిత్రసీమలోని ప్రముఖులు ఏ మాత్రం అతీతులు కాదు. సినీ పరిశ్రమలో కూడా నటీనటుల మధ్య స్నేహం, వైరం అనే రెండు రిలేషన్స్ చూస్తుంటాం. అందుకే తాజాగా ఛార్మిని ఉద్దేశిస్తూ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

స్పెషల్‌గా ఛార్మి పేరు వాడేస్తూ

స్పెషల్‌గా ఛార్మి పేరు వాడేస్తూ

ప్రస్తుతం పూరిజగన్నాథ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ పై ఛార్మితో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ పూరిపై, ఛార్మిపై ఆసక్తికర కామెంట్ చేసింది రమ్యకృష్ణ.

గోవాలో మహా సరదాగా.. పూరి జగన్నాథ్‌, ఛార్మితో కలిసి

గోవాలో మహా సరదాగా.. పూరి జగన్నాథ్‌, ఛార్మితో కలిసి

రొమాంటిక్ సినిమా షూటింగ్ లో భాగంగా గోవాలో గడపడం సరదాగా ఉందంటూ తెలిపిన రమ్యకృష్ణ.. ఈ సినిమా సమ్మర్‌లో యూత్ ఆడియన్స్‌కి కిక్కివ్వడం ఖాయం అని పేర్కొంది. ఆకాష్ పూరి, కేతిక శర్మ సూపర్ పర్‌ఫార్మెన్స్ చేస్తున్నారని తెలిపింది. ఇక డైరెక్టర్ అనిల్ పాదూరి ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడని చెబుతూనే పూరి జగన్నాథ్‌, నా రాక్షసి ఛార్మితో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందని పేర్కొంది.

ఇది స్నేహమా? లేక వైరమా?

ఇది స్నేహమా? లేక వైరమా?

దీంతో రమ్యకృష్ణ పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. పైగా ఈ కామెంట్ తో పాటు ఆమె పెట్టిన ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. రమ్యకృష్ణ చేసిన కామెంట్ చూసి.. ఛార్మికి ఆమెకు మధ్య ఇంత స్నేహం ఉందా! అని ఆశ్చర్య పోతున్నారు నెటిజన్లు. ఇంకొందరైతే ఇది స్నేహం కాదు వైరం అంటూ కామెంట్ చేస్తున్నారు.

పూరి తనయుడు హీరో

తన కొడుకు ఆకాష్ పూరీని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మేరకు తన స్వీయ దర్శకత్వంలో కొడుకు హీరోగా పెట్టి 'మెహబూబా' సినిమా రూపొందించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో మరో దర్శకుడికి తన కొడుకు బాధ్యతను అప్పజెప్పి నిర్మాతగా రొమాంటిక్ సినిమా తీస్తున్నాడు.

ఆకాష్ పూరి- కేతిక శర్మ రొమాంటిక్ డోస్

ఆకాష్ పూరి- కేతిక శర్మ రొమాంటిక్ డోస్

అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానే 'రొమాంటిక్'. ఈ సినిమాలో ఆకాష్ పూరి హీరోగా నటిస్తుండగా అందాల భామ కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే పేరుకు తగ్గట్టే ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ మరింత ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ద్వారా తెలిసింది.

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
టాప్ లెస్‌ బ్యూటీ.. కేతిక శర్మ

టాప్ లెస్‌ బ్యూటీ.. కేతిక శర్మ

పూర్తి స్థాయిలో యూత్‌‌ను టార్గెట్ చూస్తూ పూరీ తరహా ప్రేమ కథా చిత్రంగా రొమాంటిక్ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్‌ సూపర్ హిట్ మూవీ 'ఇడియట్' తరహాలోనే ఈ జనరేషన్ అభిరుచికి తగినట్టుగా 'రొమాంటిక్' రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హీరోయిన్ కేతికశర్మను టాప్ లెస్‌గా వెనుక నుంచి చూపించి అందరి దృష్టినీ లాగేశారు పూరీ.

English summary
Akash Puri's Romantic movie shooting successfully going on. Presently this movie schedule is running in Goa. Ketika Sharma is the heroine, and sinor heroine Ramya Krishnan playing lead role. Now Ramya Krishnan shared a pic with Charmy Kaur.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more