రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం లభ్యం.. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఒక్కోసారి సెలెబ్రిటీలకు సంబంధించిన వార్తలు దావానంలా వ్యాప్తి చెందుతాయి. క్షణాల్లో అవి వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం నాటి హీరోయిన్, శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె కారులో లెక్కకు మించి మద్యం దొరకడం, ఆమె కారు డ్రైవర్ అరెస్ట్ కావడం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది.అయితే ఇంతలా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ వార్తలపై రమ్యకష్ణ ఇప్పటి వరక స్పందించలేదు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

కరోనా రూల్స్..
తమిళనాట కరోనా తాండవం చేస్తుండటంలో అక్కడ కొన్ని నిబంధనలు విధించారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌లో భాగంగా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళ నాట కూడా మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాలపై ఆంక్షలు కూడా భారీగానే ఉన్నాయి.

రమ్యకృష్ణ కారులో మద్యం..
రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటిపై ఎక్కడా అధికారికంగా స్పందించలేదు.

భారీ స్థాయిలో లభ్యం..
రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు( TN07Q 0099)లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు 96 బీర్ బాటిల్స్ 8 లిక్కర్ సీసాలు గుర్తించారని తెలుస్తోంది. దీంతో వెంటనే ఆమె డ్రైవర్ సెల్వకుమార్ ని అదుపులోకి తీసుకున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Recommended Video

రమ్యకృష్ణ విడిపించినట్టుగా..
అయితే అరెస్ట్ అయిన తన కారు డ్రైవర్‌ను రమ్యకృష్ణ స్వయంగా వచ్చి బెయిల్‌పై తీసుకుని వెళ్లినట్లుగా మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అయితే వీటిపై ఆమె అధికారికంగా స్పందిస్తే గానీ ఏం జరిగిందో తెలియదు. రమ్యకృష్ణ ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తుంది.


Click it and Unblock the Notifications











