అదొక్కటే శాశ్వతం.. ‘రిపబ్లిక్’ నుంచి రమ్యకృష్ణ లుక్ వైరల్

బాహుబలిలొ శివగామి పాత్రను పోషించాక రమ్యకృష్ణ కెరీర్ మళ్లీ పీక్స్‌కు చేరింది. ఆమె కోసం కొన్ని పాత్రలు పుట్టాయి. ఆమె సినిమాలో ఉంటే చాలు అనుకుని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ మళ్లీ శివగామి రేంజ్‌లో రమ్యకృష్ణకు ఒక్క పాత్ర పడలేదు. కానీ ఇప్పుడు రమ్యకృష్ణ వరుసగా పవర్ఫుల్ పాత్రల్లో కనిపించబోతోంది. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, దేవా కట్టా వంటి దర్శకుల సినిమాల్లో రమ్యకృష్ణ నటిస్తోంది.

చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్‌తో మరింత అందంగా

కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ చిత్రంలో రమ్యకృష్ణ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. ఈ మేరకు బయటకు వచ్చిన రమ్యకృష్ణ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతోన్న లైగర్ సినిమాలోనూ రమ్యకృష్ణ ఓ కీ రోల్ పోషించబోతోంది. అయితే దేవా కట్టా సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతోన్న రిపబ్లిక్ చిత్రంలోనూ రమ్యకృష్ణ అదరగొట్టబోతోంది.

 Ramya Krishnan Look From Republic Movie

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పేసింది. తప్పూ ఒప్పులు లేవు.. అధికారం మాత్రమే శాశ్వతం అంటూ వదిలిన ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణ ఓ రేంజ్‌లో ఉంది. విశాఖ వాణి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోన్నట్టు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లు నటిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X