ఒకే సినిమాలో శివగామి.. రాములమ్మ.. అదిరిపోయే పాత్రలు, పారితోషికం కూడా!
Recommended Video
ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గాల పేర్లు సినిమాను క్రేజీగా మలుస్తున్నాయి. మహర్షి రిలీజ్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రంలో రమ్యకృష్ణ, విజయశాంతి కీలక పాత్రలను పోషిస్తున్నారనే వార్తలు సినిమాపై మరింత హైప్ పెంచాయి. వివరాల్లోకి వెళితే..

సూపర్‌స్టార్ కోసం శివగామిని
నరసింహా చిత్రంలో నీలాంబరి పాత్ర తర్వాత రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బాహుబలిలో శివగామి పాత్ర ఆమె కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. శైలజారెడ్డి అల్లుడులో పవర్ ఫుల్ అత్తగా సత్తా చాటింది. తాజాగా మహేష్ బాబు చిత్రంలో మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. ఆమె రేంజ్ సరితూగే పాత్ర అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

విజయశాంతిని రంగంలోకి దింపిన
ఇక చాలాకాలంగా మేకప్ వేసుకోకుండా రాజకీయాల్లో కొనసాగుతున్న ఫైర్ బ్రాండ్ యాక్టర్, లేడీ అమితాబ్ విజయశాంతిని కూడా ఈ సినిమాలోకి రప్పించారు. సినిమాకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో థర్డ్ ఇన్నింగ్ ప్రారంభించేందుకు రాములమ్మ సిద్ధమైంది. అయితే ఈచిత్రంలో నటించడానికి భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందనే మాట వినిపిస్తున్నది.

కీలక పాత్రలో స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్
మహేష్ బాబు కోసం ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ లాంటి సీనియర్ యాక్టర్లను అనిల్ రావిపూడి రంగంలోకి దించారు. అంతేకాకుండా స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత బండ్ల గణేష్ కామెడీకి ప్రాధాన్యం ఉన్న రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం టాప్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ల ఎంపిక పూర్తి అయినప్పటికీ.. వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నట్టు తెలిసింది.

సుకుమార్ అవుట్.. అనిల్ రావిపూడి ఇన్
వాస్తవానికి మహర్షి సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమాలో నటించాల్సింది. అయితే కథ పూర్తిస్థాయిలో రూపొందకపోవడంతో అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాక్షన్, డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











