Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
నా శీలాన్ని శంకించి..హోటల్ గదిలో పవిత్ర లోకేష్‌తో చేసిందేమిటి? వీకే నరేష్ కడిగిపారేసిన మూడో భార్య
ప్రముఖ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్ బజారున పడింది. ఇప్పటి వరకు చాటుమాటుగా సాగిన వారిద్దరి అఫైర్‌ను మూడో భార్య రమ్య రఘుపతి బయటపెట్టింది. మైసూర్‌లోని హోటల్‌లోని ఓ గదిలో ఉన్న నరేష్, పవిత్రా లోకేష్‌ను రమ్య రెడ్ హ్యాండెడ్‌గా మీడియాకు పట్టించింది. అనంతరం రమ్య మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. రమ్య చెప్పిన విషయాల్లోకి వెళితే..

వీకే నరేష్ డ్యాన్సులు, విజిల్స్
మైసూరులోని
గదిలో
ఉన్న
నరేష్,
పవిత్ర
లోకేష్
మీడియా
కెమెరాలకు
చిక్కారు.
రమ్య
తన
మద్దతు
దారులతో
కలిసి
హోటల్‌లో
హంగామా
చేశారు.
మీడియా
కెమెరాల
నుంచి
పవిత్రా
లోకేష్
తప్పించుకోవడానికి
ప్రయత్నించారు.
నరేష్
ఉత్సాహంగా
కెమెరాల
ముందు
డ్యాన్స్
చేస్తూ..
విజిల్
వేస్తూ
హల్‌చల్
చేశారు.
ఈ
సందర్భంగా
నరేష్,
పవిత్రా
లోకేష్‌కు
వ్యతిరేకంగా
రమ్య
మద్దతు
దారులు
నినాదాలు
చేశారు.

మీ అమ్మాయికి అన్యాయం జరిగితే?
మైసూరులోని ఓ హోటల్‌లో పవిత్ర లోకేష్, నరేష్ ఒకే గదిలో రాత్రి ఉన్నారని సమచారం అందింది. అయితే రాత్రి పూట రచ్చ చేయడం ఇష్టం లేక నేను ఉదయం వరకు వేచి ఉన్నాను. మీడియాను వెంటపెట్టుకొని హోటల్‌కు వెళ్లాను. వారిద్దరూ ఒకే రూమ్‌లో ఉండటం మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా సాక్ష్యాలు లభించాయి. మీ ఇంట్లో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగితే ఊరుకొంటారా అని రమ్య అన్నారు.

నరేష్ నిజ స్వరూపం మీడియా ముందు
హోటల్ గదిలో వారిద్దరిని పట్టించడం, మీడియా ముందు వారిని నిలబెట్టడంతో నేను విజయం సాధించాను. నరేష్ నిజ స్వరూపం మీడియాకు చూపించాను. పరాయి ఆడదానితో హోటల్‌లో ఉన్నానని, తప్పు చేసిన భావన నరేష్‌లో కొంచెం కూడా కనిపించకపోవడం దారుణం. కింద పడినా గానీ.. మీసాలకు మట్టి అంటలేదుగా అనే కన్నడ సామెతను నరేష్ గుర్తు చేశాడు అని రమ్య చెప్పింది.

నా జీవితంతో నరేష్ ఆడుకొన్నాడు అంటూ
నా జీవితంతో వీకే నరేష్ ఆడుకొన్నాడు. నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వీకే నరేష్‌ను ఎందుకు వదిలిపెట్టాలి. కర్ణాటక ప్రజలు నాతో ఉన్నారు. నా క్యారెక్టర్‌ను దారుణంగా నాశనం చేశాడు. నా బిడ్డ చేత కంటతడి పెట్టిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి నేను ఎందుకు విడాకులు ఇవ్వాలి. విడాకులు ఇవ్వడం వల్ల నాపై పడిన మచ్చ పోతుందా? సొసైటీలో నాపై పడిన ముద్ర పోతుందా? మేమిద్దరం కలిసి మాట్లాడుకొంటే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ నా క్యారెక్టర్ మీద చాలా అభండాలు వేశాడు అని రమ్య ఆవేదన వ్యక్తం చేసింది.

నా వ్యక్తిత్వంపై అసత్య ప్రచారాలు
చట్టాలకు వ్యతిరేకంగా భార్యకు విడాకులు ఇవ్వకుండా మరొకరితో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి హోటల్‌లో ఒకే గదిలో ఉన్నారు. నా వ్యక్తిత్వం, నా జీవితం, నాశీలం గురించి నీచంగా మాట్లాడటానికి వారెవరు? నా క్యారెక్టర్‌ను, నా ఫ్యామిలీ ప్రతిష్టను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని రమ్య రఘుపతి ఘాటుగా స్పందించారు.