EVOL గమ్మత్తైన టైటిల్ వెనుక కథేమిటంటే? లవ్ స్టోరితో ఎక్సైటింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఎవోల్
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఊపందుకొన్న తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినీ అభిమానుల అభిరుచికి తగినట్టుగా కొత్త అనుభూతిని కలిగించే విధంగా నిర్మాత దర్శకులు కొత్త కథలు, విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెటా? అగ్ర హీరోలా అనే తేడా, లెక్కలు లేకుండా కంటెంట్ బాగుంటే ఆ సినిమాను ప్రేక్షకులు భారీగా హిట్ చేస్తున్నారు. అలాంటి కోవలో వస్తున్న చిత్రం EVOL. గమ్మత్తు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా వివరాల్లో వెళితే..
తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ బ్యానర్‌పై రామ్‌యోగి వెలగపూడి దర్శక, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎవోల్. Love అనే పదాన్ని తిరగేసి EVOL గా టైటిల్‌ను ఖరారు చేశారు. అలా టైటిల్‌ను తిరగేయడం వెనుక అసలు కథ సినిమా చూస్తేనే అర్ధమవుతుందని దర్శక, నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను బిజీగా జరుపుకొంటున్నది.

దర్శక నిర్మాత రామ్‌యోగి మాట్లాడుతూ.. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ప్రేమ కథ ఇది. తెలుగు ప్రేక్షకులు చూడని డిఫరెంట్ జానర్‌తో రూపొందుతున్నది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్లనున్నది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం. దర్శక నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నమిది. మీ అందరి ఆదరణ కావాలని కోరుతున్నా అని అన్నారు.

నటీనటులు: సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ తదితరులు
కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి
సంగీతం: సునీల్ కశ్యప్,
కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్,
ఎడిటర్: విజయ్,
ఆర్ట్: యోగి వెలగపూడి,
కొరియోగ్రాఫర్: జిన్నా
పీఆర్వో: మధు విఆర్


Click it and Unblock the Notifications











