సంక్రాంతికి కర్చీప్ వేసేశాడు.. రానా ‘అరణ్య’ రెడీ
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అరణ్య (హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళ్‌లో కాదన్) గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ మూవీ కోసం రానా భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. భల్లాలదేవుడు అరణ్య కోసం బక్కచిక్కిపోయాడు. ఆ సమయంలో రానాకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయని టాక్ బయటకు వచ్చింది. అంత కష్టపడిన సినిమా వాయిదాలు పడుతూనే వచ్చింది.
మామూలుగా ఈ చిత్రం ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సింది. టీజర్‌తో అందరిలోనూ అంచనాలు పెంచేశారు. ఇక సినిమా విడుదలకు రంగం సిద్దమైంది కూడా. కానీ కరోనా విజృంభించడంతో మొత్తం తారుమారైంది. మధ్యలో ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలు కూడా పెట్టుకున్నారని టాక్ వచ్చింది. కానీ మొత్తానికి ఆ నిర్ణయానికి దూరంగా.. థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావించింది.

తాజాగా అరణ్యకు సంబంధించిన అప్డేట్ రానా ఇచ్చేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుందని, అడవుల గొప్పదనం మనకు ఇప్పటికైనా తెలిసింది.. జాగ్రత్తగా కాపాడుకుందాం. అడవుల గురించి అవగాహన కలిగించేందుకు అరణ్య వస్తోందని రానా తెలిపాడు. ఇక మొత్తానికి సంక్రాంతికి కర్చీప్ వేసుకున్న హీరోగా రానా ముందు వరుసలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications