అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!

రానా దగ్గుబాటి చేస్తోన్న మరో ప్రయోగం అరణ్య (హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళ్‌లో కాదన్) గురించి అందరికీ తెలిసిందే. బాహుబలిలో భళ్లాల దేవుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా.. ఇలా అరణ్యకోసం రూపం మార్చేసుకున్నాడు. ఈ మూవీ కోసం రానా భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. అయితే రానా ఇంతగా కష్టపడ్డ ఈ సినిమాకు సరైన సమయం రావడం లేదు. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ వాయిదాలు పడుతూనే ఉంది.

ఎప్పుడో రావాల్సిన మూవీ కరోనా లాక్డౌన్ వల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఆ మధ్య అరణ్య విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 26న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందని.. అన్ని భాషల్లోనూ ఒకే సారి రాబోతోందని ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. అయితే అన్ని భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్ రావడం లేదు.

 Rana Aranya Trailer on 3rd march 2021

ఈ మేరకు రానా ఓ ట్వీట్ వేశాడు. 2021లో రాబోతోన్న మొట్టమొదటి త్రిభాష చిత్రం గురించి మీరు ఎదురుచూస్తున్నారా?.. మనిషికి ప్రకృతికి మధ్య జరిగే ఈ భీకర పోరు.. అందులో ఈ ఏనుగుల రక్షణ కోసం జరిగే యుద్దం త్వరలోనే రాబోతోంది. అరణ్య, కాదన్ ట్రైలర్‌ను మార్చి 3న.. హాథీ మేరీ సాథీ ట్రైలర్‌ను మార్చి 4వ తేదీని విడుదల చేయబోతోన్నామని రానా ప్రకటించాడు. మొత్తానికి తెలుగు, తమిళంలో ఒకసారి.. హిందీలో వేరేగా ట్రైలర్‌ను ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X