రవితేజ డిజాస్టర్ సినిమాపై రానా సెటైర్లు.. హరీష్ స్ట్రాంగ్ రిప్లై!

ఈ ఏడాదిలో తెలుగు సినిమా దగ్గర పండుగల మూమెంట్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అలా సంక్రాంతి నుంచి మొన్న దీపావళి వరకు కూడా పండుగ పబ్లిక్ హాలిడేస్ సీజన్ కి వచ్చిన చాలా సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి కానీ ఈ పండుగల్లో కూడా ఒక డిజాస్టర్ సీజన్ ఈ ఏడాదిలో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆగస్ట్ 15 రేస్ అని చెప్పాలి.

నిజానికి ఈ డేట్ లో ఇండియాస్ అవైటెడ్ సీక్వెల్ సినిమా పుష్ప 2 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అది తప్పుకునేసరికి ఒక్కసారిగా చాలా సినిమాలే వచ్చాయి. కాగా ఈ సినిమాల్లో అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యినవే అని చెప్పక తప్పదు. పైగా పలు సినిమాలు అయితే ఆ సినిమా యూనిట్స్ ఒకరితో ఒకరు వర్క్ చేసినప్పటికీ కూడా పోటీ వాతావరణంలో వారికి మనస్పర్థలు కూడా రాక మానలేదు.

rana Daggubali and teja sajja satires on mr bachchan deeply hurted director gave reply

ఇలా కాంట్రవర్సియల్ గానే జరిగిన ఈ ఆగష్టు 15 బాక్సాఫీస్ వార్ లో టాలీవుడ్ సినిమాలు మాస్ మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ అలాగే రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ లు వచ్చాయి. ఈ రెండు భారీ డిజాస్టర్స్ అయ్యాయి. అయితే వీటిలో మిస్టర్ బచ్చన్ విషయంలో జరిగిన హంగామా అయితే అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయ్యాక దారుణంగా ట్రోల్స్ కి గురయ్యింది.

పైగా దర్శకుడు హరీష్ శంకర్ పై కూడా చాలానే కామెంట్స్ వినిపించాయి. అయితే మిస్టర్ బచ్చన్ ప్లాప్ ఎఫెక్ట్ ఇపుడు ఏకంగా సినీ నటులే ట్రోల్ చేసే విధంగా మారిపోయింది. ఇటీవల ఐఫా అవార్డుల వేడుక జరిగిన సంగతి తెలిసిందే.కాగా ఈ ఈవెంట్ ని యంగ్ హీరోస్ తేజ సజ్జ అలాగే రానా దగ్గుబాటిలు హోస్ట్ చేశారు కానీ ఇందులో మిస్టర్ బచ్చన్ సినిమా పేరిట చేసిన కామెంట్స్ మాత్రం రవితేజ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసాయి.

'బచ్చన్ గారికి ఈ ఏడాది హైయెస్ట్ హై చూసారు లోయెస్ట్ లో కూడా చూసారు.. హైయెస్ట్ హై కల్కి, లో వచ్చేసి మిస్టర్ బచ్చన్' అంటూ చేసిన కామెంట్స్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో దీని కోసమే చాలా మంది మాట్లాడుకున్నారు. కాగా ఇది దర్శకుడు హరీష్ శంకర్ వరకూ చేరింది. మరి దీనిపై తన తోటి ఇండస్ట్రీ వారే ఇలాంటి కామెంట్స్ చేయడంపై హరీష్ శంకర్ కూడా బాగా హర్ట్ అయ్యినట్టు అనిపిస్తుంది. దీనితో తాను స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు.

"ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇది ఒకటి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు నాకైనా ఎవరికైనా" అంటూ హరీష్ ఇచ్చిన స్పందన ఇపుడు అటెన్షన్ తీసుకుంది. దీనితో తమలానే అవతల వాళ్ళకి కూడా ఓ రోజు వస్తుంది అంటూ హరీష్ శంకర్ ఇచ్చిన కౌంటర్ ఈ కాంట్రవర్సీ మరోసారి రేగేలా చేసింది. మరి ఇది మున్ముందు ఇంకెక్కడ వరకు వెళుతుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X