ఆ సినిమా షూటింగ్ బాహుబలి కంటే కష్టమైంది: రానా
రానా దగ్గుబాటి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ననిలిచిన చిత్రం బాహుబలి. ఆ సినిమా కోసం రానా ఏ స్థాయిలో కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలో అతను చేసిన యాక్షన్స్ సీన్స్ కోసం కొన్ని సార్లు గాయపడ్డాడు కూడా. అయితే అంతకంటే ఎక్కువగా మరో సినిమాకు కష్టపడ్డాడట ఈ స్టార్ హీరో.
రానా దగ్గుబాటి నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో రానా చేసిన పాత్ర గురించి అలాగే లొకేషన్స్ లో ఏనుగు వలన పడిన ఇబ్బందుల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. సినిమా కోసం బాహుబలి కంటే ఎక్కువ కష్టపడ్డాను అంటూ ముఖ్యంగా ఏనుగు తొండం మోయలేకపోయానని అన్నాడు.

అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే పాత్రలో ఏనుగు సంరక్షకుడిగా నటించాడు. అయితే ఏనుగు తొండం తన భుజంపై వేసినప్పుడు సుమారు 160-170కేజీల బరువు ఉండేదని రానా తెలిపాడు. అప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. ఈ సినిమా చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని తప్పకుండా అందరికి నచ్చుతుందని కూడా రానా వివరణ ఇచ్చాడు. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











