Rana Daggubati: ఉపాసన, అల్లు స్నేహా గురించి రానా ఆసక్తికర నిజాలు.. కామెంట్స్ వైరల్
దగ్గుబాటి రానా మొదటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రానా అప్పుడే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి సత్తా చాటాడు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే భళ్లాలదేవగా పవర్ ఫుల్ విలనిజం పండించి అట్రాక్ట్ చేశాడు. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటించిన రానా తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ మార్చి 10న విడుదలైన విషయం తెలిసిందే. దీనికోసం నిర్వహించిన ప్రమోషన్స్ లో తాజాగా ఉపాసన కొణిదెల, అల్లు స్నేహ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు రానా.

తండ్రీ కొడుకులుగా..
భీమ్లా నాయక్, విరాట పర్వం సినిమాల తర్వాత రానా నుంచి ఒక్క సినిమా రాలేదు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. రానానే కాకుండా ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కూడా ఓటీటీలోకి అడుగుపెట్టారు. బాబాయ్ అబ్బాయి అయిన వెంకటేష్, దగ్గుబాటి తండ్రీ కొడుకులుగా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మించిన విషయం తెలిసిందే.

మార్చి 10 నుంచి..
ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా రూపొందింది. ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించగా.. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు. మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్ ఉందని ఆరోపిస్తున్నారు.

చిన్ననాటి స్నేహం..
అయితే సాధారణమై వెబ్ సిరీస్ లలో అలా ఉండటాన్ని యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రజలు ఫ్యామిలీ హీరోగా స్టార్ బ్రాండ్ తెచ్చుకున్న వెంకటేష్ తో అలా బూతులు చెప్పించడం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు రానా. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు అండగా ఉండే స్నేహితుడు ఎవరు అని అడిగితే తనకు చాలా మంది స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని తెలిపాడు రానా.

తొమ్మిదో తరగతి వరకు..
"నేను ఇక్కడే పెరగడం వల్ల చాలా మంది స్నేహితులు అయ్యారు. అయితే వారిలో మొదటి స్థానంలో రామ్ చరణ్ ఉంటాడు. ఎందుకంటే నేను, రామ్ చరణ్ చిన్నప్పుడు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నాం. తొమ్మిదో తరగతి వరకు మేము చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ లో కలిసి చదువుకున్నాం. చిన్ననాటి స్నేహాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే.. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా మా స్కూలే. ఆమె మాకు జూనియర్. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మా క్లాస్ మేట్" అని రానా తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ప్రాణ స్నేహితులుగా..
అయితే సినిమా రంగంలో పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. హీరోలు మాత్రం ఒకరితో మరొకరు స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారు. ఇంకా చెప్పాలంటే మన టాలీవుడ్ హీరోల్లో కొందరు ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రామ్ చరణ్, రానా దగ్గుబాటి ఒకరు. బయట సినిమా కార్యక్రామాల్లో పెద్దగా కలిసి కనిపించకపోయినా చైల్డ్ హుడ్ నుంచి ఫ్రెండ్స్ అని తాజా ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోయింది.


Click it and Unblock the Notifications











