twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా గ్రాండ్ మ్యారేజ్.. నితిన్ మాత్రం ఎవరికి తెలియకుండా.. పెళ్లి వేదికలు ఫిక్స్!

    |

    ఈ కరోనా వైరస్ కరెక్ట్ సమయానికి దెబ్బేసినట్లు అనిపిస్తోంది. పెళ్లి అనే ప్రపంచానికి చాలా దూరంగా ఉన్న నటీనటులు చాలా మంది ఏకంగా పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. జీవితంలో భారీగా జరుపుకునే ఒకే ఒక్క సెలబ్రేషన్ కాబట్టి స్టార్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా కరోనా దెబ్బకు ఆశలన్నీ చాలా చిన్నగా మారిపోయాయి. ఎదో రకంగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక ఫైనల్ గా నితిన్, రానా పెళ్లి చేసుకోవడానికి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    ఒక ప్లాన్ రెడీ..

    ఒక ప్లాన్ రెడీ..

    గత ఏడాది నుంచి ఎవరికి తెలియకుండా ప్రేమలో మునిగి తెలుతున్న ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లి చేసుకోవాలని సమ్మర్ లో గట్టి ప్లాన్ వేసుకున్నారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. కరోనా వైరస్ తగ్గుతుందేమో అని ఇన్నాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ దాని డోస్ తగ్గడం లేదు. ఇక తప్పని వేళ ఈ ఇద్దరు ఒక ప్లాన్ తో రెడీ అవుతున్నారు.

    రానా గ్రాండ్ ప్లాన్స్..

    రానా గ్రాండ్ ప్లాన్స్..

    రానా దగ్గుబాటి మిహికా బజాజ్ ల వివాహానికి ఇప్పటికే ఒక డేట్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు కళ్యాణ వేదికను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు తనయుడి వివాహాన్ని గ్రాండ్ గా చేయాలని మొదటి నుంచి అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా తాజ్ ఫలక్ నుమా వేదికను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 8వ తేదీన కేవలం అతికొద్ది మంది గెస్టుల సమక్షంలో వీరి వివాహం జరగనుందట.

    నితిన్ సైలెంట్ గా..

    నితిన్ సైలెంట్ గా..

    ఇక రానా కారోన్ టైమ్ లోనే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటే.. నితిన్ మాత్రం.. చాలా సైలెంట్ గా పెళ్లి వ్యవహారాన్నీ ముగించుకోవాలని అనుకుంటున్నాడు. తన ప్రేయసి షాలినిని పెళ్లి చేసుకోవాలని మొదట్లో దుబాయ్ లో ప్లాన్ చేసుకున్న నితిన్ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ ఫార్మ్ హౌజ్ కి షిఫ్ట్ అయ్యాడు. జులైలోనే నితిన్ షాలినిల వివాహం కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Rana Daggubati Engaged To Miheeka Bajaj| Tollywood Funniest Wishes
    ఆ పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో..

    ఆ పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో..

    మొత్తానికి నితిన్, రానా ఎదో ఒక రకంగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ ప్లాన్ లో ఏ మాత్రం తేడా రాకుండా కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారట. ఇక వీరి వివాహం అనంతరం ఆగస్ట్ లో మెగా డాటర్ నిహారిక వివాహం జరగనున్న విషయం తెలిసిందే. మరి ఆ పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Rana Daggubati's end card for solo life is known. Rana who ran her love track unbeknownst to others, is finally getting ready to marry the girl she loves. Clarity has recently revealed via social media that she is about to marry a young girl named Mihika Bajaj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X